తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ మాజీమంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు అంగట్లో అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం కోట్లాడి… ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటి అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కి కొనసాగే అర్హత ఎంత ఉందో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. TSPSC ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం పై ఆందోళన కల్గిస్తుందన్నారు. ఇప్పటి వరకు దీనిపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
Also Read : NTR: అందరి కంటే ముందే వచ్చేసిన ఎన్టీఆర్.. కారణం అదేనా..?
పేపర్ లీకేజీపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అసలేందుకు మాట్లాడరు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. లీక్ ఎలా జరిగింది.. ఎవరీ ప్రవీణ్ తేలాలి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోకి ప్రవీణ్ ఎలా వచ్చాడు.. అసలు నిందితుడు ప్రవీణ్ తెలంగాణ పౌరుడు కూడా కాదు అని ఆయన ఆరోపించారు. ఏపీకి చెందిన వ్యక్తి ప్రవీణ్.. TSPSC లోకి చొరబడ్డాడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రెస్ మీట్ ఆశ్చర్యంగా ఉంది.. ఆయన అసమర్థత బయట పడిందని జీవన్ రెడ్డి విమర్శించారు. నమ్మిన వాడే మోసం చేశాడు అని అంటున్నాడు.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ నైతిక బాధ్యత వహించి.. తన పదివికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మోసపోయే నీకు.. అలాంటి బాధ్యతలు ఎందుకు అంటూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు