Harish Rao: ఆరోగ్య మహిళకు మంచి స్పందన.. 11 వేల మందికి స్క్రీనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండు మంగళవారాల్లో 11 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు. మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. మొదటి మంగళ వారం (ఈనెల 14న) 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 975 మందికి అవసమైన మందులు అందజేశారని తెలిపారు. ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారని మంత్రి చెప్పారు.
Also Read:Rain Alert: మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తుండటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాల పై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక మరికొందరు ఇబ్బంది పడ్డారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారని వెల్లడించారు. రెండో మంగళ వారం (ఈనెల 21న) 6,328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్ ను సందర్శించారని తెలిపారు.వీరిలో 3753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3783 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 718 మందికి మూత్రకోష ఇన్ఫెక్షన్ల నిర్ధారణ పరీక్షలు, 1029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్ పరీక్షలు, 477 మందికి విటమిన్ – డి లోప పరీక్షలు, 1294 మందికి సిబిపి పరీక్షలు నిర్వహించారని వివరించారు.
Also Read:TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు.. కోచింగ్ సెంటర్లపై నిఘా!
కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కరీంనగర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే 8 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?