Harish Rao: సిద్ధిపేట జిల్లా మంత్రి హరీష్ రావు పర్యటన కొనసాగుతుంది. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎల్కాతుర్తి- రామయంపేట జాతీయ రహదారి విస్తరణ పనులపై మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు జరిగే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి కాంట్రాక్టర్ ని మందలించారు. పనులు జరిగే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతాల్లో ప్రమాద సూచికలు, బోర్డింగ్, హోర్డింగ్ లు పెట్టాలని కాంట్రాక్టరుకు మంత్రి ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుపై వాహనాలను నిలుపొద్దని, ప్రజలకు, ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని రోడ్డు కాంట్రాక్టర్ సూపర్వైజర్లకు మంత్రి సూచించారు.
Read also: CM KCR: రైతులకు కేసీఆర్ భరోసా.. ఎకరానికి 10 వేలు పరిహారం
అంతకు ముందు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లాపరోస్కోపి ఎక్విప్ మెంట్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 70లక్షల విలువైన పరికరాలను సిద్దిపేట, గజ్వేల్ ఆసుపత్రికి ECIL కంపెనీ బృందం ఇచ్చింది వారికి ధన్యవాదాలన్నారు. నార్మల్ డెలివరీ ల సంఖ్య పెంచేందుకు వ్యాక్యుం అసిస్టేడ్ డేవిసేస్ దోహదం చేస్తుందని తెలిపారు. 99.9 శాతం డెలివరిలలో 66 శాతం ప్రభుత్వ ఆసుపత్రి లలో 33శాతం ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ లు జరుగుతున్నాయని అన్నారు. సురభి మెడికల్ కళాశాలలో వారం రోజుల ముందే సర్జరీలు చేస్తూ డెలివరీ చేయడం సరికాదన్నారు. పేషెంట్ లతో సెక్యూరిటీ గార్డు నుండి వైద్యుల వరకు నవ్వుతూ పలకరిస్తూ చికిత్స అందించాలన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా..? 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో భారీ కుదుపు