బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయం అయింది. పోలీసులు వెహికిల్ లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావుకు గాయమైంది. కాగా.. పలువురు బీఆర్ఎస్ నేతలను సైబరాబాద్ పీఎస్ నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.
సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. హరీష్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
BRS Leaders: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడిని కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. రేవంత్ 9 నెలల పాలనలో 2 నెలల పెన్షన్ మింగేశారని హరీష్ రావు విమర్శించారు.…
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. PAC చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంకి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కె పూడికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. లోక్ సభలో PaC చైర్మన్ KC వేణుగోపాల్ కి ఇవ్వలేదా అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకుని లోక్ సభలో మాట్లాడతారని, రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. రాష్ట్ర…
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చర్య తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) స్వాగతించింది. హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. “ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు గణనీయమైన ఎదురుదెబ్బ. పార్టీ మారిన వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పష్టంగా తెలియజేస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన…
Harish Rao: జైనూర్... ఘటన అత్యంత పాశవికంగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
ఖమ్మంలోని బీకే నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హరీష్ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆయన విమర్శించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి అన్నారు హరీష్…
మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్లు ఉండనున్నారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను…