హరీష్ రావు చిట్.. చాట్ సోది చాట్ లాగ ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు చీప్ పాలిటిక్స్ కు తెరలేపుతుండు అని ఆయన ఆరోపించారు. మూసి నదిపై ఆక్రమంగా కట్టిన కట్టడాలను కూలగొడితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పది ఏండ్లలో చేయలేని పని.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఈర్శ తో హరీష్ రావు…
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని,…
MLC Kavitha: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో అత్యధిక CMRF చెక్కులు అందినటువంటి నియోజకవర్గం సిద్దిపేట అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా సిద్దిపేట తీర్చిదిద్దుకున్నామని, సిద్దిపేటలో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్‌కు తరలించుకుపోయిందన్నారు హరీష్ రావు. కొడంగల్‌కు అవసరమైతే కొత్త కాలేజీని నిర్మించుకోవాలి గాని సిద్దిపేటకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అని, 150…
రాష్ట్రంలోని 25,000 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ (బిఎఎస్) కోసం నిధులు విడుదల చేయాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్దిపేట ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు శనివారం కోరారు. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రాసిన లేఖలో హరీశ్‌రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో ₹130 కోట్లు కేటాయించారని, మొదటి విడతగా ₹ 50 కోట్లు విడుదల…
సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మంత్రులే రుణమాఫీ మొత్తం కాలేదని ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ…
BRS Dharna: రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనున్నది.
భూవివాదాలను త్వరగా పరిష్కరించండి.. మంత్రి లోకేష్ ఆదేశాలు ప్రజా సమస్యల పరిష్కారం ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని…
సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో ఇద్దరం నిలబడదామని, మళ్లీ హరీష్ రావు గెలిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి రావాలి మైనంపల్లి హనుమంత రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. బీఆరెస్ రుణమాఫీ సమస్యపై సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్…
సీఎం రేవంత్ రెడ్డి రూ. రెండు లక్షల రుణమాఫీ చేయగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని శబాష్ అని మెచ్చుకోలేక టెన్షన్ లో వాళ్ళు ఉన్నారన్నారు.