CM Revanth Reddy: కేటీఆర్..హరీష్ రావు..సెక్రటేరియట్ రండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అన్నారు. ఒకటి తప్పులు..రెండోది అప్పులు అన్నారు. ఈ అప్పులు..తప్పులతో రాష్ట్రం నిండా మునిగిందన్నారు. కంటోన్మెంట్ నీ మున్సిపాలిటీ లో కలపల్ని కొట్లడింది నేను.. నువ్వు కాదు.. నీ తాత తెచ్చిందా? అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఫాం హౌస్ కూలగొట్టాలా వద్దా..? అని ప్రశ్నించారు. కిరాయి మనుషులతో..బావ బామ్మర్ది లు ధర్నాలు చేయిస్తున్నారన్నారు. మూసి నీ అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతారని ప్రశ్నించారు. మూసి పేదలకు ఇండ్లు ఇవ్వాలా వద్దా? అని ప్రశ్నించారు. నమ్మి మోస పోయినా పేదలకు పరిహారం ఇద్దాం రండి అన్నారు. ఎంపీ గా గెలిచినవు కదా.. మోడీ నుండి ఎంత తెప్పిస్తావో తే.. నువ్వు కూడా బతకనీకి వచ్చినావు..
మోడీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు.. మేము మూసి అభివృద్ధి చేయొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఈటెల.. దా మోడీ దగ్గరకు పోదాం అన్నారు. ఏం ఇప్పిస్తావో రా.. కేటీఆర్..హరీష్ ముందు రోజు మాట్లాడతారు.. తెల్లారి వాళ్ళు మాట్లాడిన కాగితం పట్టుకున్నాడు ఈటెల అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిగా.. పాత పార్టీ గత్తర వాసన పోవడం లేదన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో పేదలకు ఇండ్లు కట్టింద్దామన్నారు. రండి మోడీ దగ్గరకి పోదాం మాకేం భేషజాలు లేవు.. కేటీఆర్..హరీష్..సెక్రటేరియట్ రండి అని పిలుపు నిచ్చారు. చెరువులు ఆక్రమించుకున్నాడు ఎవరు అనేది చర్చిద్దాం అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సూచన చేస్తున్న అన్నారు. హైదరాబాద్ చెరువుల లెక్క తీద్దామన్నారు. ఎవరు ఆక్రమణ చేశారు.. ఎవరు వెంచర్ వేశారు.. అనేది లెక్క తీద్దాం అన్నారు. తాగు నీరు అందించే చెరువుల్లో ఫాం హౌస్ కట్టుకున్నారని మండిపడ్డారు. చెరువులో నీళ్ళు రోడ్ల మీదకు వస్తున్నాయని.. పరిష్కారం చూపించాలన్నారు.
Read also: Bathukamma Day-2: నేడు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే..
పేదలను అడ్డం పెట్టుకొని ఫాం హౌస్ లు కాపాడాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు అనుమతి ఇవ్వమన్నారు. మూసి ఆక్రమించిన వారికి ఎలా సాయం చేద్దాం అనేది చెప్పండి? డబుల్ బెడ్ రూం ఇచ్చామన్నారు. చదువుకు స్కూల్ పెడుతున్నామన్నారు. ఈటెల కు వచ్చిన దుఃఖం ఏంది? వాళ్ళు బాగుండటం ఇష్టం లేదా? ప్రభుత్వం పేదల గొంతు కోయద్దు.. చెరువుల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే అన్నారు. నాలా లాపై నిర్మాణాలు తొలగించాల్సిందే అన్నారు. మూసి బాధితులకు ఇల్లు తో పాటు… తొవ్వ ఖర్చులకు 15 వేలు ఇచ్చినం అన్నారు. నివేప్పుడైన ఇలాంటి ఆలోచన చేశావా? ఈటెల పదేళ్లు ఉన్నావు కదా.. అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వడం నేరమా? బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు ఎంత సాయం చేయాలో చెప్పు..అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా ప్రజలు మూసి బాధ భరించలేక పోతున్నారు.
Read also: Akkineni : మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..?
నల్గొండలో అడుగు పెట్టు.. మూసి తో పంటలు ఎంత కాలుష్యం అవుతుంది అనేది చూడు అని తెలిపారు. నల్గొండ ప్రజా కోసం ప్రక్షాళన చేయాలన్నారు. నెత్తి మీద జుట్టు లేనోడు కూడా బుల్డోజర్ నా మీద నుండే పోవాలి అంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. మీకోసం ఏం కొనం.. దారిలో పోయే కుక్క కరిచినా చస్తరన్నారు. తొలగిస్తే సంచులు వస్తున్నాయి అంటాడు ఒకడు.. తొలగిస్తే తిట్లు పడుతున్న.. భవిష్యత్ కోసం నేను ఆలోచన చేస్తున్న కేటీఆర్.. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మాట్లాడటానికి నోరు.. రాసుకోవడానికి టీవీ ఉందని ఏది పడితే అది మాట్లాడకు అని మండిపడ్డారు. సబితమ్మ పేద అరుపులు అరవకు అన్నారు. నీ ముగ్గురు కొడుకుల ఫాం హౌస్ లు లేవా..? అని ప్రశ్నించారు. నీ ఫార్మ్ హౌస్ ల లెక్క కూడా ఉందన్నారు. హరీష్ రావు నీకు అమీన్ పూర్ లో ఫాం హౌజ్ ఉంది కదా? అది అక్రమం కాదా..? అని ప్రశ్నించారు.
K. A. Paul: కొండా సురేఖ మాటలకు అమెరికాలో పరువు నష్టం దావా వేస్తారు..