Harish Rao: మూసీ ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి..
- ఆపదొస్తే ఫోన్ చేయండి.. అర్ధగంటలో మీ ముందుంటా..
- బుల్‌డోజర్లు వచ్చినా- జేసీబీలు వచ్చినా.. ముందు మమ్మల్ని దాటి రావాలి..
- రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: మూసీ ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు. హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. అనవసరంగా మూసి సుందరీకరణ అంటున్నారు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యా నించారు. కాంగ్రెసు పార్టీ అంటే ఆపన్న హస్తం అంటారు…కానీ ఇది భస్మాసుర హస్తం గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మార్చుకొని… బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి అన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ లో ఉందని గుర్తు చేశారు. ముందు నీ ఇల్లు, నీ సోదరుని ఇల్లు కూల్చుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదొస్తే ఫోన్ చేయండి.. అర్ధగంటలో మీ ముందుంటా అన్నారు. బుల్‌డోజర్లు వచ్చినా.. జేసీబీలు వచ్చినా.. ముందు మమ్మల్ని దాటి రావాలన్నారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి ఇళ్లు సర్వే నెంబర్ 30 రెడ్డికుంటలో ఉంది.. కుంటలో ఉన్న ని ఇళ్లు ముందు కూలగొట్టు రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిసినోళ్ల దగ్గరుండి కట్టిస్తున్నావ్.. పేదల ఇండ్లకు మాత్రం కూలగొడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవిత కాలం ఐదేండ్లు మాత్రమే.. కానీ నువ్వు కూల గొట్టే పేదల ఇండ్లు జీవిత కాలం కళ అన్నారు. మీకు ఇబ్బంది వస్తే.. తెలంగాణ భవన్‌కు రండి.. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయ్ అన్నారు. అర్ధరాత్రి వచ్చినా.. మీకు ఆశ్రయమిస్తామని హరీష్ రావు అన్నారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీలోకి మురికి నీరు రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ భవన్‌కు ప్రజలు పూర్తిగా గోడు చెప్పడానికే వచ్చారని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం బాధితుల వద్దకు వెళ్తున్నామన్నారు.
Also Read
Siddipet Crime: మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు..
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!