డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం.. ఈ నవరాత్రులలో ప్రత్యేకం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్..…
CM Revanth Reddy: కేటీఆర్..హరీష్ రావు..సెక్రటేరియట్ రండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అన్నారు. ఒకటి తప్పులు..రెండోది అప్పులు అన్నారు....
మల్లన్నసాగర్ వర్సెస్ మూసీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీపై బీఆర్ఎస్, మల్లన్నసాగర్ పై కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. గజ్వేల్లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీఆర్ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తామెక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించలేదని.. మీలాగా బాధితులపై లాఠీలతో కొట్టించలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మల్లన్నసాగర్ బాధితుల సమస్యలను సీఎం…
మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ లో భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. తాను.. నిన్నటి నుంచి అన్నం తినలేదని, నిద్రకూడా పట్టలేదంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హోదాలో కొండా సురేఖ వెళ్లారు. అక్కడ ఎంపీ అయిన.. రఘునందన్ రావు.. పూలమాల వేసి మంత్రిగారికి వెల్ కమ్ చెప్పారు. కొంత మంది దీన్ని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు.…
Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Harish Rao: మూసి ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు.
Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు.
మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారన్నారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారన్నారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి…