మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ లో భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. తాను.. నిన్నటి నుంచి అన్నం తినలేదని, నిద్రకూడా పట్టలేదంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హోదాలో కొండా సురేఖ వెళ్లారు. అక్కడ ఎంపీ అయిన.. రఘునందన్ రావు.. పూలమాల వేసి మంత్రిగారికి వెల్ కమ్ చెప్పారు. కొంత మంది దీన్ని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అందురు కూడా.. బాధ్యతగా వ్యవహరించాలని అందరిని కోరుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు. మరోవైపు కొండా సురేఖపై ట్రొలింగ్ లపై మంత్రి సీతక్కకూడా స్పందించారు. ఇది హేయమైన చర్య అని అన్నారు.
Mehbooba Mufti: అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నెతన్యాహునే అతిపెద్ద ఉగ్రవాది..