Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి..
- పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించిన హరీష్ రావు..
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని తెలిపారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ సభ్యులని, మీ కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ వెంటే ఉంటారని భరోసా ఇచ్చారు. బాధితులకు రక్షణ కవచంలా ఉంటామన్నారు. బాధితులకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చివేసి మూసీపై పెద్ద భవనాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేసే అంశంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు పట్టించుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రతిష్టను సీఎం రేవంత్ దెబ్బతీస్తున్నారన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాకే మూసీపై ముందస్తుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కూకటపల్లిలో హైడ్రా బాధితుడు బుచ్చమ్మడిది ఆత్మహత్య కాదు, రేవంత్‌రెడ్డిది హత్య. ఇల్లు కట్టుకుని ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బాధతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.
Also Read
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
- Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు..
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!