Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నది గర్భంలో ఇల్ల నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది. హైదరాబాద్ కి ప్రాణాంతకంగా మారుతుంది. పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారు. ధన, మానప్రాణాలు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. అందులో భాగంగా చెరువులను రక్షించేందుకు భవిష్యత్తు తరాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో చర్యలు చేపట్టాం. వందల చెరువులు కనపడకుండా పోయాయి. కనీసం చెరువు గర్భంలో కట్టుకోకుండా అయినా ఆపాలి అనేది మా ప్రభుత్వం ఆలోచన అన్నారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు.
Read also: Siddipet Crime: మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు..
మూసి పునర్జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నాం. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారి పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పించడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చేపట్టడం.. వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడడమే ప్రభుత్వ ఉద్దేశం. మూసీ నది పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేందుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికి కూడా మంచిది కాదు అన్నారు. హైదరాబాద్ అంటేనే.. లెక్స్..రాక్స్.. పార్క్స్ అన్నారు. లెక్స్స్ లో ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారని తెలిపారు. పేదలను ముందు పెట్టీ బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఎఫ్ టీ ఎల్ లో ఇండ్లు కట్టుకున్నవే కూల్చేస్తున్నామన్నారు. ఇంకా బఫర్ జోన్ పై నిర్ణయం తీసుకోలేదన్నారు. మూసి లో కూడా ఇండ్లు కట్టుకున్నారని, అది వారికి..వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదన్నారు. మూసి లో ఇండ్లు కట్టుకున్న వాళ్ల కి బయట డబుల్ బెడ్ రూం ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు.
Harish Rao: మూసి ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి..