సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా…
దేశంలో ప్రవేశిస్తున్న కొత్త వైరస్ లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా భయం నుంచి ప్రజలు ఇప్పుడే కోలుకున్న తరుణంలో మరో కొత్త వైరస్ భయాందోళనలను సృష్టిస్తోంది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై.. శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
Gujarat: గుజరాత్‌లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు.
Chandipura virus: గుజరాత్ రాష్ట్రాన్ని కొత్త వైరస్ కలవరపెడుతోంది. ‘చండీపురా వైరస్’గా పిలిచే ఇన్ఫెక్షన్ల కారణంగా ఇప్పటికే నలుగురు పిల్లలు మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో ఇద్దరు పిల్లలు ఈ అనుమానిత వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారని శనివారం అధికారులు పేర్కొన్నారు.
భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇందుకు ఉదాహరణ.
ఆదివారం గుజరాత్‌లోని హైవేపై 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రక్షణ గోడపై నుంచి పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం సపుతర కొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో చిక్కుకుంది.