ఆదివారం గుజరాత్‌లోని హైవేపై 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రక్షణ గోడపై నుంచి పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం సపుతర కొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో చిక్కుకుంది.
గుజరాత్‌లోని సూరత్‌లో సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారని, శిథిలాల కింద నుంచి ఒక మహిళను సజీవంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సూరత్‌లోని సచిన్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని చిఖోద్రాలో చోటుచేసుకుంది. ఇరవై మూడేళ్ల సల్మాన్ వోహ్రా జూన్ 22న గుజరాత్‌లోని చిఖోద్రాలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.
NEET 2024 : దేశంలో నీట్ పరీక్షకు సంబంధించిన అంశం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ తర్వాత ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంది.
గుజరాత్‌లోని పౌడర్ కోటింగ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు.
సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం జనాలు ప్రాణాలకు మించి తెగిస్తున్నారు. ఇంతకుముందు.. రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి ఎత్తైన భవనం నుంచి కిందకు వేలాడుతూ.. ఓ వీడియో తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా.. ఇద్దరు యువకులు రీల్స్ కోసమని రెండు థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ కచ్‌లోని ముంద్రా సముద్రతీరంలో జరిగింది.
ఈ మధ్య యువతకు రీల్స్ పచ్చి మరింత ముదిరింది. ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.