గత కొంత కాలం నుండి యువత రోడ్లపై వికృత చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. కొందరు యువకులు రోడ్లపై వాహనాలతో స్టెంట్స్ చేస్తూ కొన్ని రకాల విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఓ జంట రోడ్డుపై వెళ్తున్న సమయంలో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం…
గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొకైన్ పట్టుబడకుండ స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. కాగా.. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు.
Amul Milk Prices: గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. 'అమూల్' బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
గుజరాత్ లోశనివారం నాడు అతివేగంగా వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్ లోని సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్ ను దూకి మొదాసా నుంచి మల్పూర్ కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టినట్లు సమీపంలోని ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ రికార్డ్ అయిన వీడియో ద్వారా అర్థమవుతోంది.…
గుజరాత్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలో రెండు బస్సులు భారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మల్పూర్ నుండి వస్తున్న గుజరాత్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ను దాటి మోదసా నుండి మల్పూర్కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. కాగా.. ప్రమాద ఘటనకు సంబంధించి సమీపంలోని ఓ ఇంటి…
గత వారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఘోరం కళ్లముందు ఇంకా మెదిలాడుతోంది. గేమ్ జోన్ తగలబడి దాదాపు పిల్లలతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గుజరాత్‌లోని బోర్తలావ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. పిల్లలంతా స్థానిక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే.. బట్టలు ఉతకడం కోసమని.. స్నానానికి చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగడంతో చిన్నారులు నీటిలో మునిగి పోయారు.
ISIS Terrorists: ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫైనల్స్ ఇలా దేశమంతా కోలాహలం నిండి ఉండగా, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారీ దాడికి కుట్ర పన్నింది. శ్రీలంకకు చెందిన వ్యక్తుల సాయంతో ఉగ్రదాడులు నిర్వహించాలని ప్లాన్ చేసింది,