CPM Srinivasa Rao: గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు.. జీవో 590 రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్ల లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి.. అన్యాక్రాంతం అయిన భూములు వెనక్కి తీసుకుని పేదలకి ఇవ్వాలని కోరారు.. అదానీకి చట్ట విరుద్ధంగా కేటాయించిన భూములు కూడా అందులో ఉన్నాయి.. గత ఐదేళ్లలో ఎస్ఈజెడ్ పేరిట తీసుకున్న భూములలో పరిశ్రమలు రాలేదు.. ఇన్వెస్టర్ కారిడార్, ఎస్ఈజెడ్ లకు ఇచ్చిన భూములు ఐదేళ్ళు పైబడినవి పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.. గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు.. జీవో 590 రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. 2014-19 తరహాలో పంటల భీమా పథకం వల్ల రైతులకు న్యాయం జరగదు అన్నారు. ప్రైవేటు కంపెనీలు 80 శాతం వాటా కలిగి ఉన్న భీమా… ఇచ్చేది ప్రభుత్వం.. తీసుకునేది ప్రైవేటు కంపెనీలు అని.. రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.. ఉచిత ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని కోరారు.. ఇక, స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేయాలని మా డిమాండ్ అన్నారు.. ఢిల్లీకి రెండోసారి వెళుతున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేకహోదా అంశాలపై క్లారిటీ తీసుకోవాలని సూచించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
Read Also: JD Vance : ఎవరు ఈ జెడి వాన్స్.. ఆయనకు భారత్తో సంబంధం ఏంటి..?