రిలయన్స్ అధినేత , పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. వివాహానికి ముందు రోజు ‘అంబానీ ఇంట జరుగుతోన్న వివాహ వేడుకలో బాంబు పేలనుంది’ అంటూ ఓ వ్యక్తి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వేడుక జరగడానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఎట్టకేలకు బాంబు బెదిరింపుకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 32 ఏళ్ల ఇంజనీర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతడిని ముంబై తీసుకువస్తున్నట్లు తెలిపారు.
Read Also: MLC Kavitha: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం జూలై 12న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, హిందీ మరియు దక్షిణ భారత సినీ ప్రముఖులు, దేశంలోని దాదాపు అందరు అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు.
Read Also: Karnataka: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి