Pakistani Couple: పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట, భారత సరిహద్దు దాటి బీఎస్ఎఫ్‌కు పట్టుబడింది. పాకిస్తానీ వ్యక్తి, అతడి ప్రేమికురాలు ఇంటి నుంచి పారిపోయి కాలినడకన గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఎస్‌ఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని భుజ్‌లోని హరిపార్‌లోని జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.
Bride Killed: మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతోన్నారు. కానీ, పెళ్లికి ఒక గంట ముందు వధువు దారుణహత్యకు గురైంది. కాబోయే భర్త చేతుల్లో హత్యకు గురైంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో జరిగింది. బాధితురాలిని సోనీ హిమ్మత్ రాథోడ్‌గ గుర్తించారు. నిందితుడు సాజన్ బరైయా చేతిలో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ జంటకు శనివారం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక గంట ముందు ఈ దారుణం చోటు చేసుకోవడంతో వధువు కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.…
Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. "తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని" అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్‌వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్‌ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి…
అరేబియా సముద్రంలో తీవ్రమైన ‘శక్తి’ తుఫాన్ ఏర్పడింది. ప్రస్తుతం తీరం వైపునకు దూసుకొస్తోందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 420 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లుగా పేర్కొంది. గుజరాత్, పశ్చిమ-నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని వెల్లడించింది.
Crime: 15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంతో చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మంగళవారం సిబ్బంది క్వార్టర్స్‌లో మృతి చెంది కనిపించింది. ఆమె మృతదేహం నగ్న స్థితిలో లభించింది. ఈ సంఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు సాంకేతిక నిఘా ఉపయోగించి అమ్రేలికి చెందిన మోహాన్ పార్ఘిని నిందితుడిగా…
Crime: ‘‘లాఫింగ్ ఎమోజీ’’ ఒకరి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఒక ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ అతని ముగ్గురు బంధువులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితంత తన తాత రూప్నారాయణ్ భింద్ మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అయితే, ప్రిన్స్‌కు పరిచయస్తుడైన బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ ఈ పోస్టుకు ‘‘నవ్వుతున్న ఎమోజీ’’ని పెట్టాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు…
గుజరాత్‌లోని పోర్బందర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.
Pani puri: చాలా వరకు నగరాల్లో, పట్టణాల్లో రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, ట్రాఫిక్ వల్ల రోడ్లపై అంతరాయం, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ, గుజరాత్‌లో పానీపూరి వల్ల ఓ మహిళ రోడ్డుపై బైఠాయించిన ఘటన వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది.