Fire Accident : గోవా సమీపంలో గుజరాత్ నుంచి శ్రీలంక వెళ్తున్న కార్గో షిప్ లో భారీ అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : గోవా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కార్గో షిప్‌లో పెను ప్రమాదం సంభవించింది. కార్గో షిప్‌లో భారీ మంటలు చెలరేగాయి. ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతోంది. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళం వెంటనే నౌకను మళ్లించింది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుడిని గుర్తించగా, అతడు ఫిలిప్పీన్స్ పౌరుడని తేలింది. ఓడలో మొత్తం 21 మంది ఉన్నారు. ఇందులో ఫిలిపినో, మాంటెనెగ్రిన్, ఉక్రేనియన్ పౌరులు ఉన్నారు.
Read Also:Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
Also Read
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
@IndiaCoastGuard MRCC #Mumbai received distress call on 19 Jul 24 from container carrier MV Maersk Frankfurt 50 NM off #Karwar regarding major #fire onboard. #ICG #Dornier & Ships Sachet, Sujeet and Samrat pressed into action. #ALH and additional aircraft being mobilized to… pic.twitter.com/b6JKlY2f75
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 19, 2024
అగ్నిప్రమాదానికి గల కారణాలను కోస్ట్ గార్డ్ వివరిస్తూ.. ఓడలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలు మొత్తం వ్యాపించడంతో ఓడలో ఉన్న వారికి విషయం తెలిసిందని చెప్పారు. ఈ నౌక 2024లో మాత్రమే ప్రారంభించబడింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ డేంజరస్ గూడ్స్ (IMDG)గా సరుకు రవాణా చేయబడుతోంది. ఓడలో మంటలు చెలరేగాయని తెలిసిన వెంటనే ఓడలో ఉన్న సిబ్బంది స్వయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలను అదుపు చేయలేకపోయారు. మంటలు త్వరగా డెక్‌కు వ్యాపించడంతో కంటైనర్లు పేలిపోయాయి. ఓడలో ఉన్న 160 కంటైనర్లలో 20 మంటల్లో చిక్కుకున్నాయి. భారత తీరానికి 80 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Read Also:Simhachalam Giri Pradakshina 2024: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు కీలక సూచనలు
ఓడలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటలను ఆర్పేందుకు మూడు నౌకలను ఘటనా స్థలానికి పంపినట్లు కోస్ట్ గార్డ్ మనోజ్ భాటియా తెలిపారు. ఓడలో ఉన్న వ్యక్తులను తరలించడానికి కోచి బేస్ నుండి హెలికాప్టర్‌ను పంపాలని ఆదేశించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ (MOC), ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR)కి కూడా పరిస్థితి గురించి సమాచారం అందించింది.
- Tags
- Goa
- goa ship fire
- Gujarat
- Srilanka
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!