MK Stalin: తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు.
గవర్నర్ రవి మరో పంచాయతీకి తెర లేపాడు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఊటీలో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తీవ్రంగా విమర్శించాయి.
Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది.
తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఈరోజు భారీ మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక తీర్మానం ప్రవేశ పెట్టారు. గతంలో అమోదం పొందిన సుమారు 10 బిల్లులను పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు తీసుకోవాలి కోరారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్…
Tamil Nadu: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు…
MK Stalin: తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకేగా వ్యవహారం నడుస్తోంది. అధికార డీఎంకే పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవిని టార్గెట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి వెళ్లిపోవాలంటూ గతంలో డీఎంకే శ్రేణులు పోస్టర్లు కూడా అంటించారు. ఇటీవల రాజ్ భవన్ ప్రధాన గేటు ముందర ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులను పేల్చడం మరోసారి రెండు వ్యవస్థల మధ్య ఘర్షణకు కారణమైంది. బీజేపీ చీఫ్ అన్నామలై, డీఎంకే పార్టీనే ఇలా స్పాన్సర్ చేస్తూ…
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కారుక వినోద్ అనే వ్యక్తి రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబులు విసిరిన కేసులో కూడా వినోద్ అరెస్టయ్యాడు. ఈకేసులో మూడు రోజుల క్రితమే విడుదయ్యాడు.
Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది.