Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
ఒక కార్యక్రమానికి హాజరైన ఆర్ఎన్ రవి విద్యార్థుల్ని ‘‘జైశ్రీరాం’’ అని నినాదం చేయాలని కోరారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఆయన చర్యని ప్రభుత్వంతో పాటు విద్యా సంస్థల నాయకులు ఖండిస్తున్నారు. ఒక విద్యాసంస్థ కూడా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరింది.
Read Also: Bengal Waqf Clashes: బెంగాల్‌లో బలపడుతున్న బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ.. ఇంటెల్ హెచ్చరిక..
SPCSS-TN (స్టేట్ ప్లాట్‌ఫామ్ ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ – తమిళనాడు) ఒక ప్రకటనలో.. ‘‘మిస్టర్ ఆర్ఎన్ రవి తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని పాటించడంలో ఆయన దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించడంలో విఫలమయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందుకు తమిళనాడు గవర్నర్‌ని వెంటనే తొలగించాలి’’ అని డిమాండ్ చేసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత శశికాంత్ సెంథిల్ కూడా రవిపై ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. ‘‘సుప్రీంకోర్టు విమర్శల తర్వాత అతను ఇప్పుడు వ్యవస్థల్ని చికాకు పెట్టడానికి విద్యార్థుల్ని జై శ్రీరాం నినదించేలా చేయడం వంటి విన్యాసాలు చేస్తున్నారు, ఆయన నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మార్గాలు కనుగొంటారు.’’ అని సెటైర్లు వేశారు. ఇది ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగ సూత్రాలను బలహీనపరిచే అహంకారం, ధిక్కరణల ప్రమాదకరమైన మిశ్రమమని అన్నారు.