తెలంగాణ నుంచి చాలా తక్కువ మంద సినీ యాక్టర్ ఉన్నారని.. అందుకే కొత్త వాళ్లను పోత్సహించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్‌లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారు.
Funds Release: గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి…
Jupally Krishna Rao : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఈ ప్రభుత్వం దిశానిర్దేశంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యాలు రానున్న ఐదేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం. మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం. దేశీయ, అంతర్జాతీయ…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. మొదటగా ఉదయం 11.30 గంటలకు వనపర్తి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేసి, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వనపర్తి పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా, ఉదయం 11.30 గంటలకు వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక…
AV Ranganath : హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్‌ఎఫ్ (DRF) బృందాల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గురువారం డీఆర్‌ఎఫ్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. అంబర్‌పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వీరికి ఒక…
CM Revanth Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో యూనివర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి, వీసీలను నియమించామని ఆయన గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ…
Welfare Schemes: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగుగా 561 గ్రామాల్లో నాలుగు కీలక పథకాలను ఏకకాలంలో ప్రారంభించారు అధికారులు. లబ్ధిదారులకు పత్రాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు. Also Read: Vehicle Scrapping Policy : ఈ పని చేస్తే చాలు.. జంక్ వాహనంపై మీకు డబుల్ టాక్స్ మినహాయింపు ఈ…
కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు.