Welfare Schemes: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగుగా 561 గ్రామాల్లో నాలుగు కీలక పథకాలను ఏకకాలంలో ప్రారంభించారు అధికారులు. లబ్ధిదారులకు పత్రాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు.
Also Read: Vehicle Scrapping Policy : ఈ పని చేస్తే చాలు.. జంక్ వాహనంపై మీకు డబుల్ టాక్స్ మినహాయింపు
ఈ వివరాలను చూస్తే.. రైతు భరోసాకు 3,07,318 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 20,336 మంది లబ్ధిదారులు, 42,267 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కింద 72,406 గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక వీటి అమలుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారు. ప్రభుత్వం మార్చి 31లోపు అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఈ నాలుగు పథకాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామంలో ఏకకాలంలో ఈ పథకాలు అమలుచేయడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
Also Read: Amit Shah : ప్రయాగ్‌రాజ్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో సంగంలో పవిత్ర స్నానం
ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు వెంటనే జమ చేయనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం, సామాజిక సమీకరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజల జీవితాల్లో అద్భుత మార్పులను కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రభుత్వ కృషి ప్రజల్లో విశ్వాసం పెంచుతుందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చొరవ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశిస్తున్నారు.