CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. మొదటగా ఉదయం 11.30 గంటలకు వనపర్తి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేసి, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ZPHS పాఠశాలను సందర్శించి, విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రోత్సహించనున్నారు.
Read Also: CM Revanth Reddy: నేడు వనపర్తిలో పర్యటించనున్న సీఎం
ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకొని, పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు రుణ మేళా, ఉద్యోగ మేళాలలో పాల్గొంటారు. సాయంత్రం 4.15 గంటలకు వనపర్తి నుంచి బయలుదేరి, ప్రస్తుతం దేశాన్ని కదిలించిన SLBC టన్నెల్ వద్దకు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించి, బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించనున్నారు. ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ బృందాలతో చర్చించి, తదుపరి చర్యలను చురుకుగా అమలు చేసే విధంగా మార్గదర్శనం చేస్తారు.
Read Also: AP Teachers Transfers: ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల..