CM Revanth Reddy : విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటింది
- విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటింది
- ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను బలోపేతం చేస్తున్నాం
- అందుకే విద్యాశాఖను నా వద్దే పెట్టుకుని.. నిరంతరం సమీక్షిస్తున్నాం
- విద్యాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు, కొత్తగా నియామకాలు చేపడుతున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో యూనివర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి, వీసీలను నియమించామని ఆయన గుర్తు చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ఈ సందర్భంగా మొగిలిగిద్దలో నూతనంగా నిర్మించనున్న పాఠశాల భవనానికి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యపై ఖర్చు చేయడం తప్ప, భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడం అవసరమని చెప్పారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని నిత్యం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచలేదని, మేం అధికారంలోకి రాగానే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చార్జీలను పెంచామన్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామని తెలిపారు.
విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచడానికి “యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒక్క గోల్డ్ మెడల్ రాలేదని, కానీ ఉత్తర కొరియా 30 గోల్డ్ మెడల్స్ సాధించిందని పేర్కొన్నారు. అందువల్ల, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించబడతాయని చెప్పారు.
మొగిలిగిద్ద పాఠశాల గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. 16 కోట్లు కేటాయించి, కొత్త భవనం నిర్మాణం ప్రారంభించారన్నారు. మొగిలిగిద్దలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ స్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టీచర్ పోస్టుల భర్తీ జరగలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినా, నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి జరుగుతున్నాయని విమర్శించారు. మేము 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!