జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.
భారత్‌కు చిన్న ఆయుధాలను విక్రయించడంపై ఉన్న నిషేధాన్ని జర్మనీ తాజాగా ఎత్తివేసింది. ఈ చర్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ మేరకు శుక్రవారం వర్గాలు వెల్లడించాయి. గతంలో, జర్మనీ నాటోయేతర దేశాలకు చిన్న ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది.
జర్మనీని ఆఫ్రికా దేశం బోట్స్‌వానా తీవ్రంగా హెచ్చరించింది. జర్మనీ ముచ్చటపడితే 20 వేల ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానా అధ్యక్షుడు మోక్‌వీట్సీ మసిసి హెచ్చరించారు.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఆయన అరెస్టుపై ఇటీవల జర్మనీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయంపై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అంతే ధీటుగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ జర్మనీని హెచ్చరించింది. జర్మనీ సీనియర్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత ఈ విషయంలో జర్మనీ తన స్వరాన్ని మార్చింది.
Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఈ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిచింది. 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుపై అమెరికా స్పందించింది.
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్‌బెర్గ్‌లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదు అయింది.
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.