Germany: జర్మనీని హెచ్చరించిన బోట్సువానా.. దేనికంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీని ఆఫ్రికా దేశం బోట్స్‌వానా తీవ్రంగా హెచ్చరించింది. జర్మనీ ముచ్చటపడితే 20 వేల ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానా అధ్యక్షుడు మోక్‌వీట్సీ మసిసి హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ హంటింగ్ ట్రోఫీలపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని ప్రతిపాదించింది. వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఈ చర్య చేపట్టింది. దీనిపై బోట్సువానా అధ్యక్షుడు మండిపడ్డారు. ఆ చర్య తమ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2024: రికార్డులకు కలిసొచ్చిన తెలుగు రాష్ట్రాలు.. మొన్న హైదరాబాద్.. నేడు..
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
తమ దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి కారణమవుతుందని మోక్‌వీట్సీ మసిసి ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంతతిని అదుపులో ఉంచడానికి వేట తప్పనిసరి అని మసిసి పేర్కొన్నారు. అవి జనావాసాలపైకి వచ్చి పంటలను ధ్వంసం చేయడం, ఇళ్లను కూల్చివేయడం చేస్తున్నాయని తెలిపారు. బోట్సువానా సమస్యల గురించి బెర్లిన్‌లో కూర్చొని చెప్పడం చాలా తేలిక అని.. ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడి మేం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Man Risks Life: 100 కి.మీ వేగం, తలపై వేల వోల్టుల కరెంట్.. రైలుపై ప్రయాణించి బతికిపోయాడు..
బోట్సువానాలో మొత్తం లక్షా 30 వేల ఏనుగులు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అత్యధికంగా జీవిస్తున్న తొలి మూడు దేశాల్లో ఇది కూడా ఒకటి. 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. అనంతరం స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో 2019లో తొలగించింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే అంగోలాకు 8,000, మోజాంబిక్‌కు 5,000 ఏనుగులను ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Mukhtar Ansari: ముఖ్తాన్ అన్సారీ మరణం.. భయంతో టొమాటోలు తింటున్న ఖైదీలు..
ఈ ఏడాది మార్చిలో 10,000 ఏనుగులను పంపిస్తామని లండన్‌ను బోట్సువానా అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు అలాంటి గిఫ్టే జర్మనీకి కూడా ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలో హంటింగ్ ట్రోఫీలను అత్యధికంగా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం జర్మనీ. ఇక ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బెల్జియం దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధించాయి. మరోవైపు మిసిసి వ్యాఖ్యలపై జర్మనీ ప్రతినిధి మాట్లాడుతూ బోట్సువానా తమ వద్ద ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Health Tips : మధుమేహానికి చెక్ పెట్టే సూపర్ జ్యూస్.. ఎలా తీసుకోవాలంటే?
- Tags
- 000 elephants
- 20
- Botswana
- germany
- send
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!