ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.…
కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో తగ్గుతున్నా, వివిధ వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతూ వైరస్ బలం పుంజుకొని తిరిగి ఎటాక్ చేస్తున్నది. వ్యాక్సిన్ తీసుకుంటున్నా కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేకపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా ఎటాక్ అవుతుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో సెకండ్ వేవ్‌కు ఈ డెల్టా వేరియంట్ కారణం అయింది. ఇప్పుడు దాదాపుగా 130 దేశాల్లో డెల్టా వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్నాయి.…
యూరప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుండటంతో వరదనీరు యూరప్‌లోని బెల్జియం, జర్మనీ దేశాలను ముంచెత్తింది. ఈ వరదల కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్టు సమాచారం. వందల మంది వరదనీటిలో కొట్టుకుపోయారని, వారి ఆచూకీ కోసం డిజాస్టర్ టీమ్, ఆర్మీ బృందాలు గాలిస్తున్నాయని జర్మనీ అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ప్రభావం జర్మనీలోని అహాల్వర్ కౌంటీ, రైన్‌లాండ్-పలాటినేట్, నార్ట్‌రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే జర్మనీ కరోనా తో…
ప్రపంచంలో టీకాలను వేగంగా అందిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో సగం మందికంటే ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ అందించారు. అలాంటి వాటిల్లో ఒకటి జర్మనీ. ఈ దేశంలో ఇప్పటి వరకు 51శాతం మందికి టీకా అందించారు. అయితే, మొదట్లో ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగింది. ఆ తరువాత, వేగం పుంజుకుంది. జర్మనీ ఛాన్సలర్ రెండు డోసుల్లో రెండు రకాల టీకాలు తీసుకొని వార్తల్లోకి వచ్చారు. Read: ఇలా ఫోజిచ్చి….…
రెండో ప్రపంచ యుద్దం సమయంలో జర్మనీ దళాలు పెద్ద ఎత్తున యూరోపియన్ దేశాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. జర్మనీ, దీని మిత్రపక్షాలు బ్రిటన్‌పై పెద్ద ఎత్తున బాంబు దాడిని చేశారు. అప్పట్లో జర్మనీ వేసిన బాంబుల్లో కొన్ని పేలగా చాలా వరకు అవి పేలలేదు. కాగా, అవి కాలగర్బంలో భూమిలో కలిపిపోయాయి. కాగా, ఇప్పుడు ఆ బాంబులు బ్రిటన్‌ను ఇబ్బందులు పెడుతున్నాయి. పేలకుండా భూమిలో ఉండిపోయిన బాంబులను అక్కడి ప్రత్యేక అధికారులు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు.…
ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్…