H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
Indian Economy: జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు.
జర్మనీలోని హాంబర్గ్ ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కత్తితో వీరంగం సృష్టించింది. విచక్షణారహితంగా కత్తితో తెగ నరికింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు.…
German Election: జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంచలనం నమోదు కాబోతోంది. తదుపరి జర్మనీ ఛాన్సలర్‌గా కన్జర్వేటివ్ కూటమి విజయం దిశగా వెళ్తోందని ఆదివారం అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మరోవైపు ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన ఓటమిని అంగీకరించారు. తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్రిక్ మెర్జ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
America : అమెరికాలో (యుఎస్) భారతీయ పౌరుడు అయిన సాయి కందుల వైట్ హౌస్ పై దాడి చేసినందుకు ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించబడింది. నిందితుడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు.
Elon Musk: క్రిస్మస్ పండగకి కొన్ని రోజుల ముందు జర్మనీలో ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలో విందు చేస్తున్న గుంపుపై కారు దూసుకెళ్లిన ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జర్మనీ ఛాన్సరల్ ఓలాఫ్ స్కోల్జ్‌ని దారుణంగా దూషించారు. ‘‘చేతకాని దద్దమ్మ’’ అంటూ స్కోల్జ్‌పై మస్క్ విరుచుకుపడ్డాడు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని శుక్రవారం మస్క్ డిమాండ్ చేశారు.
భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌లు ముందున్నాయి. అయితే డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మాత్రమే ముందున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారతదేశం 2023లో 257 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేస్తుంది. భారతదేశ డిజిటల్ ఎగుమతులు 2022 సంవత్సరంలో 17 శాతం పెరిగాయి.
Workforce Need : ప్రపంచంలోని ఐదు ఆర్థిక అగ్రరాజ్యాల్లో నాలుగో అగ్రరాజ్యమైన జర్మనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జర్మనీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. దీని కారణంగా, ఇమ్మిగ్రేషన్ విషయంలో చాలా దూకుడు విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దీని అర్థం జర్మనీ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది వలస పౌరులకు వసతి కల్పించవలసి ఉంటుంది. భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో పౌరులు జర్మనీకి వెళుతున్నందున ఈ వార్త భారతదేశానికి ఉపశమనం…
USA-Russia: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాస్కో- అమెరికాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే యూఎస్ లోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే ఛాన్స్ ఉందని ఆ దేశ ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది.