World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభించే అవకాశం ఉందని జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన రహస్య పత్రాలు పేర్కొన్నాయి. ఈ సమాచారాన్ని బిల్డ్ వార్తా పత్రికలో ప్రచురితమైంది. జర్మనీ రష్యాకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది నాటో మిత్రదేశాలపై దాడి చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించగలదని, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తాపత్రిక పేర్కొంది.
జర్మనీలో రైలు డ్రైవర్ల సమ్మెకు దిగారు. లోకో ఫైలెట్స్ జీతాల పెంపు కోసం వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడీఎల్ యూనియన్ గురువారం రాత్రి 24 గంటల సమ్మెను ప్రారంభించింది.
Germany: ఇటీవల కాలంలో యూరప్ లోని పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం చాపకింద నీరులా పెరుగుతోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో పలు దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యం యూదులకు వ్యతిరేకంగా, పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆయా దేశాల్లో హింసకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, యూకేల్లో ఇలాంటి ప్రో పాలస్తీనా నిరసనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ పలు దేశాలకు తన ఆయుధాలను విక్రయిస్తోంది. ఇటీవల నాటోలో కొత్త సభ్యుడిగా చేరిన ఫిన్లాండ్ దేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్ తన డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఫిన్లాండ్‌కి విక్రయించడానికి 340 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీనిని చారిత్రక ఒప్పందంగా ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్, యూఎస్ కంపెనీలు కలిసి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. క్రూయిజ్…
Germany: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో గత 12 గంటల నుంచి తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో హఠాత్తుగా ఓ దుండగుడు కారుతో విమానాశ్రయంలోకరి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు, గన్ తో కాల్పులు జరపడమే కాకుండా, పెట్రోల్ బాంబులను విసిరాడు. అయితే గత 12 గంటలుగా దుండగుడితో చర్చించేందుకు హాంబర్గ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దుండగుడు తీసుకువచ్చిన కారులో అతనితో పాటు 4 ఏళ్ల అమ్మాయి కూడా ఉన్నారు.…
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయం ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు రావడంతో సోమవారం అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను నిలిపివేసింది. కొన్ని గంటల తర్వాత బెదిరింపుకు ప్రతిస్పందనగా పోలీసు ఆపరేషన్ తర్వాత ఎయిర్‌పోర్టు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ఆయనను కోరారు.
పారిశ్రామిక రంంలో చైనాకు పెద్ద షాక్ తగలనుంది. చైనాకు షాకిచ్చేందుకు ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ సిద్ధమైంది. కీలక రంగాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది.