జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, రెడ్‌క్రాస్ రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ajit Agarkar: అందుకే సంజూ శాంసన్‌ను ఎంచుకున్నాం: అజిత్ అగార్కర్
బిసింగర్ మార్కెట్ చౌరస్తాలో మీటరు ఎత్తులో నీరు నిలిచిపోయింది. ఇక గుటెన్‌బర్గ్ కిండర్ గార్డెన్ ఎదుట ఉన్న నిర్మాణ స్థలం కొట్టుకుపోయింది. ఇక పలు ప్రాంతాల్లో అయితే రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాహనాలన్నీ ఒక దగ్గరు పోగుపడ్డాయి. వరదలు కారణంగా పలు రోడ్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే బాడెన్-వుర్టెంబర్గ్‌లో ప్రజలు కార్లలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం జరిగింది అన్న విషయం ఇంకా తెలియలేదు. నీళ్లు తగ్గితేనే గానీ.. అధికారులు అంచనా వేయలేరు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువులు అందక.. చాలా చోట్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Election Commission: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
ఇటీవల దుబాయ్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసేసింది. దీంతో అపార్ట్‌మెంట్లు, రోడ్లు నీరుతో నిండిపోయాయి. ఇక వర్షపు ప్రవాహనంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
#BREAKING: Flash floods in Baden-Württemberg, Germany; People reported trapped in cars. pic.twitter.com/ONsglT68LE
— War Intel (@warintel4u) May 2, 2024