రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం సరైంది కాదన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యాలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. అదానీ విషయంలో ప్రతిపక్షాల దూకుడును కొట్టిపారేసిన శరద్ పవార్ వ్యాఖ్య మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థలో చిచ్చు రేపింది.
Forbes Billionaires List 2023: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు.
Rahul Gandhi: అదానీపై నా తరువాతి ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశాను. నేను ఏ ప్రశ్న అడిగిన ఆలోచించే అడుగుతానని అన్నారు. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైళ్లలో వేయండి అని అన్నారు. దేశం నాకు గౌరవం, ప్రేమ ఇచ్చారని అన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోందని అన్నారు. నేను జైలు శిక్ష గురించి భయపడనని అన్నారు. ప్రజల్లోకి…
అత్యంత సంపన్న భారతీయ టైటిల్ ను గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ముఖేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. బుధవారం విడుదల చేసిన 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.
Gautam Adani's son Jeet Adani gets engaged to Diva Jaimin Shah: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ ఎంగేజ్మెంట్ దివా జైమిన్ షాతో ఆదివారం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగి ఈ నిశ్చితార్థానికి కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వధువు దివా ప్రముఖ వజ్రాల వ్యాపారి సి.దినేష్ & కో. ప్రైవేట్ లిమిటెడ్ యజమాని జైమిన్ షా కుమార్తె.…
Business Headlines 08-03-23: గౌతమ్ అదానీకి నిఫ్టీ షాక్: అదానీ గ్రూపు కంపెనీలకు స్టాక్ మార్కెట్ షాకిచ్చింది. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి 4 సంస్థల షేర్లను NSE తీసేసింది. ఈ నిర్ణయం 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్, టోటల్ గ్యాస్ డిలీటయ్యాయి. 100 ఆల్ఫా 30 నుంచి అదానీ పోర్ట్స్ & ఎస్‌ఈజెడ్‌ని తొలగించారు. 200 ఆల్ఫా 30 నుంచి…
Today Stock Market Roundup 02-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. 8 రోజుల నష్టాల తర్వాత నిన్న బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్‌లో ఇవాళ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో కూడా కోలుకోలేకపోయాయి. ఐటీ మరియు బ్యాంకులు, ఆటోమొబైల్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కోవటంతో సాయంత్రం భారీ నష్టాల్లో…
Supreme Court : అదానీ గ్రూప్ - హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక నుండి ఉత్పన్నమయ్యే సమస్యపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
Not only Adani. But also Ambani: రాజకీయ నాయకుల అండదండల ద్వారానే బిజినెస్‌లో పైకొచ్చాడు తప్ప సొంత తెలివితేటలతో కాదనే విమర్శలు గౌతమ్ అదానీ ఒక్కడి పైనే రాలేదు. గతంలో.. రిలయెన్స్ అధినేత ధీరూబాయి అంబానీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. బిజినెస్‌లో బలంగా నిలబడ్డారు. అందువల్ల మన దేశంలో రాజకీయ పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. రిలయెన్స్ మాత్రం రోజురోజుకీ డెవలప్ అవుతోంది తప్ప డౌన్ కావట్లేదు.
Business Headlines 28-02-23: అమరరాజా ఆర్ అండ్ డీ: అమరరాజా బ్యాటరీస్ సంస్థ.. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటుచేయనుంది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో ఈ ‘‘ఆర్ అండ్ డీ’’ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. ఇ-హబ్ పేరుతో సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు తమ గిగా కారిడార్ ప్రోగ్రామ్లో భాగమని అమరరాజా కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం విలువ 9 వేల 500 కోట్ల రూపాయలని పేర్కొంది.