ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనులతో సంబంధం ఉన్న మూడు కంపెనీల డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. అదానీ గ్రూప్‌ను పర్యవేక్షించడంలో రెగ్యులేటర్లు విఫలమయ్యారా అనే దానిపై విచారణకు కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని రోజుల ముందు రాజీనామా జరిగింది. అదానీ గ్రూప్, వినోద్ మధ్య జరిగిన కొన్ని లావాదేవీలు సరిగ్గా వెల్లడి అయ్యాయా లేదా అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విచారణ జరుపుతోంది.
Also Read:Smoking : స్మోకింగ్‌తో ఊపిరితిత్తులు చెడిపోయాయా.. వెంటనే ఇలా చేయండి
అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్ నుండి ఆస్తులను స్వాధీనం చేసుకున్న కార్మైఖేల్ రైల్, పోర్ట్ సింగపూర్ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి వినోద్ ఫిబ్రవరి 27న వైదొలిగారు. కార్మైకేల్ రైల్, పోర్ట్ సింగపూర్ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కార్మైకేల్ రైల్ సింగపూర్, అబాట్ పాయింట్ టెర్మినల్ విస్తరణ డైరెక్టర్ పదవిని కూడా వినోద్ అదానీ వదులుకున్నారు. 2013, 2018లో ఆస్ట్రేలియాలోని అదానీ కార్మైకేల్ మైనింగ్ కంపెనీ ఆర్థిక నష్టాలకు వినోద్ రాజీనామా చేసిన ఈ కంపెనీలే బాధ్యత వహిస్తాయి. ఆస్ట్రేలియాలోని గౌతమ్ మైనింగ్ ప్రాజెక్ట్‌లో వినోద్ కంపెనీల డబ్బు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, అదానీకి $120 బిలియన్ల మార్కెట్ నష్టంలో గౌతమ్ అన్నయ్య వినోద్ పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంలో వినోద్ కీలక పాత్ర పోషించారని హిండెన్‌బర్గ్ నివేదిక ఎత్తి చూపింది. అయితే, ఆ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఎలాంటి నేరాలకు పాల్పడని పేర్కొంది.