ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి మీడియా కథనాలు తెలుపుతున్నాయి. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలలో సుమారు 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ఆధారంగా మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తాలిబన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వరదల కారణంగా జిల్లా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని..…
వర్షాలు కురవడం కోసమని క్లౌడ్ సీడింగ్‌ని ఉపయోగించడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇండోనేషియా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా ఉండటానికి క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిజానికి, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 67 మంది మరణించారు.. మరో 20 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 44 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో 1500 కుటుంబాలు…
ఒమన్‌లోని మిడిల్ ఈస్ట్ నగరంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి 13 మంది చనిపోయారు. యుఏఈకి చెందిన ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమన్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లో తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ఓ చిన్నారి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Central Congo Floods Kills 22 People: సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల దాటికి కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లో 22 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లోని కనంగా జిల్లాలో గంటల తరబడి కురిసిన వర్షాలకు అనేక ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయని.. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా తెలిపారు. గోడ కూలిపోవడం…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి 2,000 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు.
Floods: మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. చెన్నై మొత్తం నదిలా మారిపోయింది. రోడ్లు, కాలనీలు నీటిలో మునిగిపోయాయి. గత కొన్నేళ్లుగా తుఫానులు వస్తున్నాయంటే చాలు చెన్నై వణికిపోతోంది. డిసెంబర్ 4, 2023 నాటికి 48 గంటల్లోనే 40 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాత నమోదు కావడం నగరాన్ని ముంచెత్తింది. గతంలో కూడా పలు తుఫాన్ల సమయంలో చెన్నై ఇలాగే వరద గుప్పిట చిక్కుకుంది.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి…
Sikkim Flood: ప్రస్తుతం సిక్కిం అతలాకుతలం అయిపోతుంది. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో భారీ వరద వచ్చింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు.