వర్షాలు కురవడం కోసమని క్లౌడ్ సీడింగ్‌ని ఉపయోగించడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇండోనేషియా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా ఉండటానికి క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిజానికి, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 67 మంది మరణించారు.. మరో 20 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 44 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో 1500 కుటుంబాలు తాత్కాలిక నివాసాలకు వెళ్లారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లోని పర్వత ప్రాంతాల గ్రామాలను శనివారం అర్ధరాత్రి దాటకముందే వరద ముంచెత్తింది.
Isro: శక్తివంతమైన “సౌర తుఫాను” నుంచి ఇస్రో మన శాటిలైట్లను ఎలా రక్షించింది..?
మరోవైపు.. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ వర్షాలు మరింత కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే భయం నెలకొంది. వర్షం పడకుండ ఉండేందుకు క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బుధవారం మేఘాలపై సోడియం క్లోరైడ్‌ను పెద్ద మొత్తంలో స్ప్రే చేశారు.
Perni Nani: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ అధికారులపై చర్యలు తప్పవు..!
కాగా.. భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలో తరచుగా కొండచరియలు విరిగిపడటం, వరదల సమస్య ఎక్కువవుతున్నాయి. పర్వతాల నుంచి వచ్చే చెత్తాచెదారం వల్ల సమీపంలో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.