సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. లొనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల అది పొంగిపొర్లడంతో తీస్తా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10 మంది మృతి చెందారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 82 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా వరదల దాటికి 14 వంతెనలు కూలిపోయాయి.
Flash Floods in Sikkim: సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఒక్కసారిగా వరదలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయారు. ఈ విషయాన్ని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం…
కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
Floods in New York: ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ…
అసోంలో ఈ ఏడాది భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు వందలాది మంది వర్షాలు, వరదలు కారణంగా మృతి చెందారు. 12 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి జోగెన్ మోహన్ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు.
Libya Floods: డేవియల్ తుపాన్ ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాను అతలాకుతలం చేసింది. తుపాను, వరదల కారణంగా ఏకంగా 20,000 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన…
Libiya: లిబియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం చాలామంది వింత ప్రయోగాలు చేస్తారు.. కొన్ని ప్రయోగాలు జనాలను మెప్పిస్తే.. మరికొన్ని మాత్రం జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి వరదల్లో భయపడకుండా సైకిల్ తొక్కుతాడు.. అది చూసిన జనం ఆ వ్యక్తిని వీడియో తీశారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఫ్లోరిడాలో జరిగిన సంఘటన ఇది.. ఇడాలియా హరికేన్ ఆ…
Tips To Escape From drowning Car:: వర్షాకాలం వచ్చేసింది. దేశంలో చాలా చోట్ల వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోవడం, నీటిలో మునిగిపోవడం చూశాం. ఆ సమయంలో మరొకరి సాయం లేకుండా బయటకు రావడం కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అటువంటి ప్రమాదాలు ఎదురైతే సులభంగా బయటపడవచ్చు. మీ కారు నీటిలో మునిపోవడం మీరు గమనిస్తే ముందు టెన్షన్ పడకండి. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని…
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.