Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Nepal: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు.
Cloudburst: ఈశాన్య రాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ‘‘క్లౌడ్ బరస్ట్’’ కారణంగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరదలు పెరిగాయి. ఇటానగర్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది. వరదల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు…