Godavari Floods: అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలకు మరోసారి గోదావరి వరద భయం పట్టుకుంది. గడచిన రెండు నెలల్లో ఐదవసారి వరద తాకిడికి గురవుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శభరి, గోదావరి నదులకు వరద ప్రవాహం ఉధృతమైంది.. కూనవరం వద్ద 42 పాయింట్ 0,2 అడుగులతో రెండవ ప్రమాద హెచ్చరికకి చేరువలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది.. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్ వే పైకి చేరింది వరద నీరు చేరింది. వీఆర్…
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద పోటెత్తింది.
కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు" అని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎక్కడ చూసినా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తరాఖాండ్ లోని డ్రెహ్రడూన్ లో గతంలో లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, రుద్ర ప్రయాగ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో వరదలు వచ్చి గ్రామాలన్ని నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖాండ్ మొత్తం విలవిలాడిపోతుంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్డు కనిపిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోతున్నాయి.…
Weather Update: తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక జిల్లాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గౌరారంలో 23.5 సెం.మీ, ఇస్లాంపూర్‌లో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి, చిన్నశంకరంపేట, దామరంచ, మాసాయిపేటల్లో కూడా 15–17 సెం.మీ వరకు వర్షాలు కురిశాయి. సిద్ధిపేట…
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పలు నగరాలు అతలాకుతలం అయ్యాయి. వస్తువులు, కార్లు కొట్టుకుపోయాయి. అలాగే ఒక నగల షాపును కూడా భారీ వరద ముంచెత్తింది.
జాకీల సాయంతో ఇళ్లను లిఫ్ట్ చేసి.. ఎత్తు పెంచడం మనందరికీ తెలిసిందే. మొదటిసారిగా ఆలయాలను కూడా లిఫ్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో.. వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు రోడ్డకు దిగువన ఉండడంతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడడాని పలు ఆలయ కమిటీలు లిఫ్ట్ చేసే పద్దతిని అనుసరిస్తున్నాయి. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అనుమతితో ఇప్పటికే 15 ఆలయాల ఎత్తు…
HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీలు వణికిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.