గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు-గోళ్లమూడి మధ్య ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మానిక్ మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు.. చెరువులు ఏకమైపోయాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. కార్లు, బైకులు, వస్తువులు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతగా వరదలు బీభత్సం సృష్టించాయి.
బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా 13 మంది మరణించారు. 4.5 మిలియన్ల మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీ నదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. గోనెగండ్ల మండలం గంజహల్లి, దేవనకొండ మండలం తెర్నెకల్ మధ్య ఉన్న హంద్రీ నదిలో 25 మంది చిక్కుకున్నారు. చిక్కుకున్న వారు గంజిహల్లికి చెందిన వారిగా తెలిసింది.
వయనాడ్ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 405కి చేరింది. గత మంగళవారం అర్ధరాత్రి వచ్చిన విలయంతో వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. బురదలో కూరుకుపోయి నివాసితులు చనిపోయారు.
ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అతి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
Telangana: తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.