ఒమన్‌లోని మిడిల్ ఈస్ట్ నగరంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి 13 మంది చనిపోయారు. యుఏఈకి చెందిన ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమన్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లో తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ఓ చిన్నారి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం సంభవించిన వరదల కారణంగా.. కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది విద్యార్థులు, ఇద్దరు నివాసితులు, ఒక వలసదారు ఉన్నారని నివేదిక పేర్కొంది. కుండపోత వర్షాల కారణంగా ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.
Attack on CM Jagan Incident: కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..
రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది
భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రాయల్ ఒమన్ పోలీస్, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, సివిల్ డిఫెన్స్ అథారిటీ మరియు అంబులెన్స్ బృందాలు పాఠశాలల నుండి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. ఒమన్ రోడ్లపై వరద నీరు కొట్టుకుపోయినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ప్రజలు తమ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఒమన్ పోలీసు ఏవియేషన్ బృందం 21 మందిని గ్రామీణ వ్యవసాయ క్షేత్రం నుండి కురియత్ గవర్నరేట్‌లోని అల్ లాస్మో ప్రాంతానికి తరలించడానికి ఒక మిషన్‌ను నిర్వహించిందని ఖలీజ్ టైమ్స్ నివేదించింది.
PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం
యూఏఈలో కూడా వాతావరణం మారిపోయింది
ఒమన్ నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కూడా వర్షాల వల్ల ప్రభావితమయ్యే అన్ని గవర్నరేట్‌లను అప్రమత్తం చేసింది. ఒమన్‌తో పాటు, యూఏఈ(UAE)లో కూడా అస్థిర వాతావరణ పరిస్థితులు ఏర్పాడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు, మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
View this post on Instagram
A post shared by مركز العاصفة لمراقبة الطقس والتغير المناخي المؤسس omar alnauimi (@storm_ae)