ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. మరు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం వర్షాలతో అతలాకుతలం అయ్యింది. తాజాగా నెల్లూరు వరదల్లో ఒక చిత్ర బృందం చిక్కుకుపోయింది. వారు సాయం కావాలంటూ వీడియో ద్వారా తెలపడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వీడియోలో తన పేరు నవీన్ అని, తాము ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నెల్లూరు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడికి వచ్చాకా భారీ…
ఏపీలోని వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు…
కడప జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెయ్యేరు నది పొంగి పొర్లుతోంది. దీంతో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న శివాలయం మునిగిపోయింది. దీంతో అక్కడ కార్తీకమాస పూజల కోసం వచ్చిన భక్తులు వరదలకు కొట్టుకుపోయారు. మొత్తం 26 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 14 మంది మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతులంతా పులమత్తూరు, మందపల్లికి చెందినవారుగా గుర్తించారు. Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు…
ఏపీలో భారీ వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ లో గత రెండురోజులుగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యం. ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. చిన్న చిన్న పనులు, పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్ ల గేటు మరమ్మత్తు పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా? అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప…
భారీవర్షాలు ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడిపోతోంది. ఏ ప్రాంతం చూసినా నీటిలోనే వుంది. కాలనీలు మూడు నాలుగు అడుగుల నీటిలోనే వుండిపోయాయి. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం వరద నీటిలో కొట్టుమిట్టాడుతోంది. తిరుపతిలో నిండు కుండలా మారింది రాయల్ చెరువు. ముంపునకు గురయ్యాయి. కాలేపల్లి, సూరాళ్లపల్లి, రాయల్ చెరువు పేట,చిట్టతూరు చెరువులు. ప్రధానంా రాయల్ చెరువు నిండుగా వుండడంతో నాలుగు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇన్ ఫ్లో…
భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు…
ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజంపేట మండలంలో వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. రామాపురం చెయ్యేరు నదిలో రెండు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు ఇరుక్కుపోయాయి. ఓ బస్సులోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. మరో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సు పైకి ఎక్కారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. మరోవైపు జిల్లాలోని సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్…
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ చైన్నైలో తీరం దాటింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విమానాలను హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాలకు మళ్లిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు…
భారీ వర్షాలతో తమిళనాడు ఇప్పటికే తడిసి ముద్దవుతుంది. ఆ రాష్ట్ర సీఎం కూడా తమిళనాడుకు ఎవ్వరూ రావొద్దని సూచించారు. తాజాగా తమిళనాడుకు మరో భారీ వర్ష ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే చెన్నైలో 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని, నవంబర్ 10, 11 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్రవాతావరణ శాఖ డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగా ళ ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిం దన్నారు. ఇది…