తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వానల వల్ల వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా.. ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కాగా.. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో అత్యధికంగా 12.8 సెం.మీ. వర్షపాతం నమోదవగా.. ఎస్సారెస్పీలోకి 10వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, కడెంలోనూ నీటిమట్టం పెరుగుతోంది. అయితే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్లోకి ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. read also: Fraud…
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం అసోంను కుంగదీస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వరదల కారణంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 11 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానస్, పగ్లాదియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదుల నీటిమట్టం కూడా అసోంలోని పలు చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. గోల్‌పరా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు…
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద బీభత్సానికి ఎంతోమంది నిరుపేదలు తమ గూడును, నీడను కోల్పోయారు. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన గ్రామాల్లో పర్యటించడానికి అసోం బీజేపీ ఎమ్మెల్యే సిబుమిశ్రా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ చోట కేవలం పాదం మునిగేంత నీరు మాత్రమే ఉంది. కానీ ఆ వరద నీటిలో నడిచేందుకు…
చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల రోజుగా విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వానలు తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపి వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో…
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్‌లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39…
వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై రాజ్య సభలో ఎంపీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలకు తీవ్రంగా నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయాయని సభకు తెలిపారు. వరదల్లో 44 మంది…
ఎడతెరిపి లేని వానలు, వరదలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట తదితర మండలాల్లోని పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇళ్లను వారు పరిశీలించారు. గంగపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్లు, ఇసుకమేట వేసిన వరిపొలాలు, కోతకు గురైన చెరువులు, ఇందుకూరుపేటలోని ముదివర్తిపాళెంలో నీట మునిగిన రాజుకాలనీని పరిశీలించారు.
అప్పులతో ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ర్టంలో జగన్ చేసిన అప్పులతో దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అప్పులు చేయకుండా పరిపాలన చేయాలని జగన్‌కు సూచించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.…
విపత్తును కూడా రాజకీయ చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికై వరదల సాయంపై ఆయా అధికారులతో మాట్లాడి బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ‘మడమ తిప్పను మాట తప్పను అన్నారు. ఇప్పుడు మడమ తిప్పుతూ మాట తప్పుతున్నారు. గిరా గిరా తిరుగుతూ ఎక్కడో పడిపోతావ్’ అని చంద్రబాబు అంటున్నారని జగన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జగన్ నేనే గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని…