భారీ వర్షాలతో తమిళనాడు ఇప్పటికే తడిసి ముద్దవుతుంది. ఆ రాష్ట్ర సీఎం కూడా తమిళనాడుకు ఎవ్వరూ రావొద్దని సూచించారు. తాజాగా తమిళనాడుకు మరో భారీ వర్ష ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే చెన్నైలో 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని, నవంబర్ 10, 11 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్రవాతావరణ శాఖ డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగా ళ ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిం దన్నారు. ఇది నవంబర్ 10న అల్పపీడనంగా మారే అవకాశం ఉంద ని, ఇది తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని, దీంతో డెల్టా జిల్లా లు, ముఖ్యంగా కడలూరు, పుదుచ్చేరి, తదితర ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతంగా మారే అవకాశం ఉందని ఆయన వివరించారు.
దీంతో విల్లుపురంలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం రాత్రి తమి ళనాడు తీరానికి ఆనుకుని సముద్రం ఒడ్డున ఈ వాయుగుండం ఏర్ప డిందని, అది ఉత్తర తమిళనాడు వైపు వెళ్లి చెన్నై ఉత్తర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. “నవంబర్ 11 న, అల్ప పీడనం ఉత్తరం వైపు కదులుతున్నట్లయితే, చెంగల్పట్టు, కాంచీ పురం, వెల్లూరులో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద న్నా రు. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని, ఇది పరి స్థితి నిబట్టి రెడ్ అలర్ట్‌గా కూడా మారుతుందని పువియరసన్ తెలిపారు. నవంబర్ 11 తర్వాత కూడా ఈశాన్య గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల సూచించారు.