తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా? తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..! ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు.…
మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.మా ఆవిడను తిట్టారని వాళ్ళ దగ్గర ఏడుపు ఎందుకు..? మీ శ్రీమతి గారిని మేము ఏమీ అనలేదని లబోదిబోమంటున్నాం. నిన్ను తిడతాం గానీ…మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ను చీదరించుకుంటున్నారు. మాకూ కుటుంబ సభ్యులున్నారు..మా…
తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, రాయసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే తూత్తుకుడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక చెన్నైనగరంలో ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. Read: ఆ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా… రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా… ఇప్పటి…
విపత్తు సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకుని వచ్చి చంద్రబాబు పర్యటన పేరుతో హంగామా చేస్తున్నారన్నారు. సహాయక చర్యల పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మండి పడ్డారు. అక్కడకు వెళ్లి తన భార్య పేరుతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం వారికి సాయం చేసిందో లేదో ఒక్కసారి…
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. “ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద…
కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. ఆర్టీపీపీలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 13, 6 యూనిట్లలో కలిపి 600 మెగావాట్లు…
వరద బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పూర్తిగా దెబ్బ తిన్నవారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని… వచ్చే 3,4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందేలా అధికారులను ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని… వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు…
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్‌లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్‌లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో…
ఏపీలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీ సరిహద్దు జిల్లాలలో కుంభవృష్టి వానలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రజా జీవనం స్తంభించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన… ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ…
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు.…