బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ చైన్నైలో తీరం దాటింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
దీంతో విమానాలను హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాలకు మళ్లిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.