ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. మరు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం వర్షాలతో అతలాకుతలం అయ్యింది. తాజాగా నెల్లూరు వరదల్లో ఒక చిత్ర బృందం చిక్కుకుపోయింది. వారు సాయం కావాలంటూ వీడియో ద్వారా తెలపడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వీడియోలో తన పేరు నవీన్ అని, తాము ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నెల్లూరు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడికి వచ్చాకా భారీ వర్షాల వలన ఎక్కడికి కదలలేని పరిస్థితి అని, తాముమొత్తం 30 మందిమి ఉన్నామని.. తమను కాపాడాలని కోరుతున్నాడు. కొవ్వూరు దగ్గర్లోని వెంకటేశ్వర బ్రిడ్జి దగ్గర తాము చిక్కుకుపోయినట్లు తెలిపిన నవీన్.. దయచేసి తమను కాపాడాలని అభ్యర్దించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.