భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు వరద ప్రవాహం వెంబడి కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు. అలాగే రాజంపేట (మం)చెయ్యేరు వరద నీటి ప్రవాహం లో కొట్టుకు పోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. రాజంపేట రామాపురం వద్ద వరదల్లో కొట్టుకపోయిన బస్సులో ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు.
దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం ఏర్పడింది. మరణించినవారిని కండక్టర్ అహోబిలం, ప్రయాణీకుడు శ్రీనివాసులు గా గుర్తించారు. గుర్తించని మరో మృతదేహం వుంది. శ్రీనివాసులు కుమారుడు శ్రావణ్ కుమార్ ఆచూకీ గల్లంతు అయింది. బస్సులో మొత్తం ప్రయాణీకుల
12 మంది వుండగా ముగ్గురు మృతిచెందారు. చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు మరో ముగ్గురు. మరో ఆరుగురు ప్రయాణీకుల ఆచూకీ గల్లంతయింది.