వర్షాలు, వరదలతో చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారు. నేనున్నాను.. మీకేం కాదంటూ సీఎం స్టాలిన్ అభయం ఇస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని పలకరిస్తూనే వరద నీటిలోనే ఆయన ముందుకుసాగుతున్నారు.
కేరళకు చెందిన వరుడు ఆకాష్, వధువు ఐశ్వర్య పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఈ నెల 18న ముహూర్తం. అయితే కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అవకాశం లేదు. ఉన్న ఊరునుంచి పెళ్ళి మంటపానికి వెళ్లేందుకు అవకాశమే లేదు. ఒకవైపు ముహూర్తం దగ్గరపడుతోంది. అటు పెళ్ళి కూతురు, ఇటు పెళ్లి కొడుకు బంధువుల్లో ఒకటే టెన్షన్ ఏంచేయాలి. చివరకు వారికో ఆలోచన వచ్చింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో పెళ్ళికి…
భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం నాగార్జున సాగర్‌కు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు క్రస్ట్ గేట్లను అధికారుల ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 64.000క్యూసెక్కులు ఉండా, అవుట్ ఫ్లో కూడా 64.000క్యూసెక్కులు ఉంది. అయితే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 311.7462 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే శ్రీశైలం…
ఎగువ నుంచి భారీ వరద నీరు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే అధికారులు 2 క్రస్ట్ గేట్ల ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 67,378 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 70,836 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం…
ఉత్తరాఖండ్‌లోని వరదలు, అందుతున్న సాయం పై పరిశీలించేందుకు నేడు అమిత్ షా వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దమానీ వరద నష్టాన్ని మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పుష్కర్ సింగ్ ఫోన్‌లో మాట్లాడి సహాయాన్ని అడిగారు.…
వరుస వరదలతో ఉత్తరాఖండ్ విలవిలలాడుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడి జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. రాష్ట్రంలోని నైనితాల్ నదీ ఉగ్రరూపం కారణంగా 30 మంది మరణించారు. చంపావత్ నదీ ప్రవాహం…
గత మూడు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి రోజున 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారంటే అర్థం చేసుకొవచ్చు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండిపోవడంతో నీటికి దిగువ ప్రాంతాలకు వదులుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద పోటెత్తింది. నదీ ఉగ్రరూపం…
ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో…
నిన్నటి రోజున నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున వరద సంభవించింది. ఈ వరద కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వచ్చిచేరింది. ఈ వరద కారణంగా జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.…
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, బడంగ్‌పేట్, మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, శంషాబాద్ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన…