తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు.. ఇలా అసత్య ప్రచారం చేయడం పద్దతి కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహనా ఉందా.. కేసీఆర్ ను రైతు హంతకుడు అని అనడానికి నోరు ఎలా వచ్చింది.
తెలంగాణలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వరదలపై గవర్నర్ ను కలవడాన్ని ఆయన తప్పుబట్టారు.
Central Team: నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం సోమవారం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయనుంది.
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో ప్రజలు నిలువనీడ లేకుండా.. సర్వం కోల్పోతున్న ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం చేపట్టిన ముఖ్యమంత్రి.. పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో హంటర్ రోడ్ నీట మునిగింది. దీంతో నయూంనగర్, శివనగర్ లకు చెందిన వరద బాధితులు బిల్డింగ్‌లపై తలదాచుకుంటున్నారు. హంటర్ రోడ్డుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తమకు సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ తెగిపోయింది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి…
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. వేర్వేరు ఘటనల్లో 8 మంది మృతి చెందారు.
ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది.