గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రాజధాని హైదరాబాద్ లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావం, సహాయక చర్యలు వంటి అంశాలపై అధికారుల ఆయన దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రస్తుతం చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్ సిటీ పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఆగ్రాలోనూ యమునా తన భీకర రూపం దాల్చుతుంది. మరోవైపు యమునా నది నీటిమట్టంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే యమునా నీటి మట్టం అనేక ప్రాంతాలను తాకింది. యమునా నది నీరు కూడా తాజ్ మహల్ కాంప్లెక్స్ సరిహద్దు దగ్గరకు చేరుకుంది.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వరదల్లేని రోడ్ల మార్గాలను ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు.
నైరుతు రుతుపవనాలతో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి.
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా మారింది దేశ రాజధాని ఢిల్లీలోని వరదల పరిస్థితి. యమునా నది ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ.. వర్షాలు తగ్గకపోవడంతో .. ఢిల్లీ ప్రజలు ఇంకా వరద నీటి నుంచి బయటికి రాలేకపోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ( శనివారం ) సాయంత్రం ఆరు గంటల తర్వాత మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు వానా పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. దీంతో వర్షం గట్టిగానే దంచి కొడుతుంది.
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.