తెలంగాణ రాష్ట్రంలో వరదలపై ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది అని ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. వరదసాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చింది.. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది.. తెలంగాణలో ఈ సారి అత్యధిక వర్షపాతం నమోదైంది అని వారు పేర్కొన్నారు.
Read Also: Rainfall In India: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
ఈ సందర్భంగా ఎంపీ కే. కేశవరావు మాట్లాడుతూ.. దేశం మొత్తం తెలంగాణను బేష్ అంటున్నారు.. కానీ, కొందరు అనరాని మాటలు మాట్లాడుతున్నారు.. కొన్ని గ్రామాల్లో 25 ఏళ్లుగా పడని వర్షాలు పడ్డాయి.. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం పనిచేసింది.. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది.. వరద నష్టం అంచనా వేస్తున్నారు.. ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.. ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుంది అని ఎంపీ కే.కేశవరావు అన్నారు.
Read Also: Rinku Singh: టీమిండియాలో స్థానం సంపాదించిన రింకూ.. కల నిజమైందని భావోద్వేగం
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు.. ఇలా అసత్య ప్రచారం చేయడం పద్దతి కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహనా ఉందా.. కేసీఆర్ ను రైతు హంతకుడు అని అనడానికి నోరు ఎలా వచ్చింది.. కేసీఆర్ సీఎం అయ్యాక ఎడారిలా వున్న తెలంగాణా ను అభివృద్ధి చేశారు అని ఆయన అన్నారు. రైతు బంధు ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇవ్వలేదు.. నోరు ఉందని అడ్డగోలుగా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్నారు.. వారికి రైతులు బుద్ది చెప్పాలి అని నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు.. కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ పై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని నామా డిమాండ్ చేశారు.
Read Also: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆనందంలో డార్లింగ్ ఫ్యాన్స్.. ?
పార్లమెంట్ లో వరధలపై చర్చ జరపాలని కోరామని నామా నాగేశ్వరరావు తెలిపారు. వరదలు వచ్చినా ప్రజలను కాపాడుకున్నాం.. బాఆర్ఎస్ ప్రజలతోనే ఉంది.. మున్నేరు వాగు సమస్య ఉందని గతంలో ఎన్నో సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలకు చెప్పాం.. కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.. మాటలు చెప్పడం కాదు.. పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల గురించి ఒక్క సారైన నోరు విప్పారా.. దేశ ప్రజలను కాపాడు కావడానికే బీఆర్ఎస్ పార్టీ పెట్టామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాము.. మాతో కలిసి రండి పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడుదాం.. చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో తెలంగాణ గురించి ప్రశ్నించండి.. రైతు హంతకుడు అనే మాటను వెనక్కి తీసుకోవాలన్నారు.
Read Also: Road Accident : 2 బస్సులు ఢీ..30 మందికి తీవ్రగాయాలు..
తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు చూసి కాంగ్రెస్ నేతలు బయపడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు నరరూప హంతకులు.. కాంగ్రెస్ ఉంటే ప్రజలు మేలు కంటే నష్టం ఎక్కువ.. మీ నాయకులు విహార యాత్రలకు, హానీ మూన్ లకు వెళ్తారు.. మా నేత రైతుల కోసం, ప్రజల కోసం మహారాష్ట్ర వెళ్లారు అని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.